రజనీ ‘2.ఓ’ విడుదల ఈ ఏడాది లేనట్టే

  • శంకర్ దర్శకత్వంలో ‘2.ఓ’
  • పూర్తికాని గ్రాఫిక్స్ పనులు 
  • వచ్చే జనవరి 26న రిలీజ్    

రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా శంకర్ దర్శకత్వంలో ‘2.ఓ’ సినిమా రూపొందింది. ఎమీజాక్సన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ ఏడాది ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. అయితే గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులు పూర్తికాకపోవడం వలన ఆ విడుదల తేదీ వాయిదా పడింది. ఇక ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలనుకుంటే పోటీ ఎక్కువగా వుంది.ఈ ఏడాది దీపావళికి ఆమీర్ ఖాన్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ .. క్రిస్మస్ కి షారుఖ్ ‘జీరో’ విడుదలకి వున్నాయి. అందువలన ‘2.ఓ’ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ‘2.ఓ’ సినిమా కోసం ఎదురుచూస్తుండగానే ‘కాలా’ థియేటర్లకు వచ్చేసింది. ఇక ‘2.ఓ’ సినిమా విడుదలయ్యేలోగా .. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీ చేస్తోన్న సినిమా కూడా థియేటర్లకు వచ్చే అవకాశం లేకపోలేదు. శంకర్ అభిమానులు మాత్రం ‘2.ఓ’ సంచలన విజయం సాధించడం ఖాయమనే నమ్మకంతో వున్నారు.

Related posts

Leave a Comment