రజనీ సరసన కథానాయికగా సిమ్రాన్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజనీ
దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజు
డార్జిలింగ్ లో మేజర్ షెడ్యూల్
ప్రస్తుతం రజనీకాంత్ .. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. రజనీకాంత్ ను డిఫరెంట్ లుక్ లో కార్తీక్ సుబ్బరాజు చూపించనున్నాడట. ఆయన లుక్ ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలోను మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా సిమ్రాన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఒకప్పుడు అగ్రకథానాయికగా సిమ్రాన్ ఒక వెలుగు వెలిగింది. ఈ మధ్యనే తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ వస్తోంది. అలాంటి ఆమెను రజనీ సరసన కథానాయికగా సంప్రదించడం విశేషం. ఊహించని ఈ అవకాశంతో ఆమె పొంగిపోతోందని అంటున్నారు. ఏకధాటిగా ఈ సినిమా షూటింగును 40 రోజులపాటు డార్జిలింగ్ లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు

Related posts

Leave a Comment