రజనీ నన్ను ‘బంగారు బొమ్మ’ అని పిలిచేవారు: ఈశ్వరీరావు

  • ‘కాలా’ టీమ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది
  • రజనీ భార్య పాత్రను చేయాలన్నారు
  • ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయాను

బాపు గారి సినిమా ‘రాంబంటు’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈశ్వరీరావు, ఆ తరువాత తమిళ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఈ మధ్యనే తెలుగు సినిమాల్లోను తన వయసుకి తగిన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న రజనీకాంత్ ‘కాలా’ చిత్రంలోనూ ఆమె నటించారు.

ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి ఆమె మాట్లాడుతూ .. “ఒక రోజున ‘కాలా’ సినిమా టీమ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేయవలసి ఉంటుంది అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో నేను రజనీ భార్య పాత్రలో కనిపించనున్నాను. నన్ను ఉద్దేశించి ఈ సినిమాలో ఆయన ‘బంగారు బొమ్మా’ అంటూ ఒక పాట కూడా పాడతారు. అప్పటి నుంచి ఆయన నన్ను ‘బంగారు బొమ్మ’ అని పిలుస్తూ వచ్చారు. ఆయన సరసన నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు .. ఈ సినిమా విడుదల కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.

Related posts

Leave a Comment