రజనీకి శుభాకాంక్షల వెల్లువ

‘తలైవా’రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తు్న్న సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వారం రోజులుగా అభిమానులతో సమావేశం అవుతూ వచ్చిన రజనీ ముందుగా చెప్పినట్లే రాజకీయ ప్రవేశం గురించి ఈరోజు ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రముఖులు ఆయన ఈ రంగంలో విజయం సాధించాలని ఆశిస్తూ విషెస్‌ తెలిపారు.

* ‘నా ప్రియమైన స్నేహితుడు, సహ నటుడు, అద్భుతమైన వ్యక్తి అయిన రజనీకాంత్‌ ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ రంగంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’- అమితాబ్‌ బచ్చన్‌

* ‘సంఘటిత ప్రజాస్వామ్యం, అభివృద్ధిపై రజనీకాంత్‌కు నమ్మకం ఉందని మనకు తెలుసు. ఆయన రాజకీయాల్లో విజయం సాధించాలని ఆశిస్తున్నాను’- ఖుష్బూ సుందర్‌

* ‘థ్యాంక్యూ లీడర్‌. మీరు రాజకీయాల్లోకి రావాలన్న మా అందరి కల ఇంకా గుర్తుంది. మంచి చేద్దాం, మంచి గురించే మాట్లాడదాం. అప్పుడే మంచి జరుగుతుంది. లీడర్‌ అభిమానులు అందరికీ శుభాకాంక్షలు’- రాఘవ లారెన్స్‌

* ‘నా ప్రియమైన స్నేహితుడు రజనీకాంత్‌కి ఆల్‌ ది బెస్ట్‌. సమాజానికి కావాల్సిన మార్పు ఆయన నాయకత్వం ద్వారా వస్తుందన్న నమ్మకం నాకుంది’- మోహన్‌బాబు

* ‘2017లో న్యూస్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఇదే. సూపర్‌స్టార్‌ రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారు. జైహో’- అనుపమ్‌ ఖేర్‌

* ‘కళా రంగంలో ఆయన ప్రాణం పెట్టి కష్టపడ్డారు. ప్రజల ప్రేమ ఆయన్ని సూపర్‌స్టార్‌ని చేసింది. అదే ప్రేమ ఆయన రాజకీయాల్లోకి వచ్చాక కూడా లభిస్తుందన్న నమ్మకం నాకుంది. ఆల్‌ ది బెస్ట్‌ సర్‌’- రితేశ్‌ దేశ్‌ముఖ్‌

Related posts

Leave a Comment