రజనీకాంత్ పార్టీ వచ్చేస్తోంది.. డిసెంబరులో ప్రారంభం!

తమిళనాడు రాజకీయ యవనికపైకి మరో పార్టీ వచ్చేస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబరులో పార్టీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు రజనీకాంత్ సన్నిహితుడైన పుదియనీతి కట్చి వ్యవస్థాపకుడు ఏసీ షణ్ముగం తెలిపారు. సోమవారం ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబరులో రజనీకాంత్ పార్టీని ప్రారంభిస్తారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. తాము కూడా రజనీకాంత్‌తోనే సాగుతామని ఆయన స్పష్టం చేశారు. కాగా, మరో సూపర్ స్టార్ కమలహాసన్ ఇప్పటికే పార్టీని ప్రారంభించి దూకుడు మీదున్నారు.
Tags: super star,rajnikanth party name,shanmugan

Related posts

Leave a Comment