యూపీలో బీజేపీ ఓటమికి వేసవి సెలవులే కారణమట .. సెలవిచ్చిన అమాత్యుడు!

యూపీలో బీజేపీ ఓటమికి వేసవి సెలవులే కారణమట .. సెలవిచ్చిన అమాత్యుడు!

బీజేపీ అభిమానులు సెలవులకు వెళ్లారు
లేదంటే గెలిచే వాళ్లమే
మంత్రి మాటలతో అవాక్కయిన నేతలు
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కైరానా లోక్‌సభ, నుపూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓటమి పాలైంది. బీజేపీ సర్కారుపై వ్యతిరేకతే ఈ ఓటమికి కారణమని విశ్లేషకులు చెబుతుండగా, అబ్బే అలాంటిదేమీ లేదని యోగి కేబినెట్‌లోని ఓ అమాత్యుడు సెలవిచ్చారు. ఆ రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులు ఓడిపోవడానికి కారణం వేసవి సెలవులేనని తేల్చారు. పార్టీ కార్యకర్తలు, విధేయులు వేసవి సెలవులకు ఊళ్లకు వెళ్లడం వల్లే పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని తేల్చి చెప్పారు.

ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిపై మంత్రి లక్ష్మీనారాయణ చౌదరి మాట్లాడుతూ.. నిజానికీ ఎన్నికలను సాధారణ ఎన్నికలతో పోల్చకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు ఎంతమాత్రమూ గీటురాయి కావన్నారు. పిల్లాపాపలతో కలిసి తమ ఓటర్లు వేసవి సెలవులకు వెళ్లడంతోనే తాము ఓటమి పాలయ్యామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇలా జరగదని పేర్కొన్నారు. ఆయన సమాధానంతో ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా అవాక్కయ్యారు.

Related posts

Leave a Comment