యూత్ హృదయాలను తాకే ‘గీత గోవిందం’ ఫస్టు లిరికల్ వీడియో సాంగ్

అలరించే అనంత్ శ్రీరామ్ సాహిత్యం
ఆకట్టుకునే గోపీసుందర్ సంగీతం
సినిమాపై పెరుగుతోన్న అంచనాలు
విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ‘గీత గోవిందం’ సినిమా రూపొందుతోంది. బన్నీవాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు లిరికల్ వీడియోను విడుదల చేశారు. “ఇంకేం ఇంకేం .. ఇంకేం కావాలే .. చాలే .. ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే .. ఇకపై తిరనాళ్లే, గుండెల్లోన వేగం పెంచావే .. గుమ్మంలోకి హోలీ తెచ్చావే” అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి వదిలిన ఈ లిరికల్ వీడియో సాంగ్ యూత్ హృదయాలను తాకేలా వుంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం ఆకట్టుకునేలా సాగింది. పదాల కూర్పు .. ప్రాసలతో చేసిన గారడీ గమ్మత్తుగా అనిపిస్తున్నాయి. గోపీసుందర్ సంగీతం .. సిద్ శ్రీరామ్ గానం ఈ పాటకి ప్రధానమైన బలంగా నిలిచాయి. మొత్తానికి ఈ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఈ లిరికల్ వీడియో ఉందని చెప్పొచ్చు.

Related posts

Leave a Comment