యాదాద్రి సమీపంలో ఘోరం… ట్రాక్టర్ మూసీ నదిలో పడి 14 మంది దుర్మరణం!

crime
  • ట్రాక్టర్ లో 30 మంది కూలీలు
  • 19 మంది మహిళలు, 11 మంది పురుషులు
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు

యాదాద్రి జిల్లా వేములకొండ సమీపంలోని లక్ష్మాపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మహిళా కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ మూసీ నదిలో బోల్తా పడి 14 మంది మరణించారు. వీరందరూ మహిళా కూలీలే. ఘటనా స్థలి వద్ద మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. వారి బంధుమిత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా కనిపిస్తోంది.

డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తుండగా, మొత్తం 30 మంది కూలీలుండగా, అందులో 19 మంది మహిళా కూలీలే. ట్రాక్టర్ నదిలో పడుతున్న సమయంలో అందులోని పురుషులంతా బయటకు రాగా, మహిళలు రాలేకపోయారని సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts

Leave a Comment