మోదీతో పళని భేటీ.. జయలలిత, అన్నాదురైలకు భారతరత్న ఇవ్వాలని విన్నపం

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు ఎంజీఆర్ పేరు పెట్టండి
రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు నిధులు కావాలి
లోక్ సభ ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత పొత్తులపై మాట్లాడతాం
ప్రధాని మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు తొలి ముఖ్యమంత్రి అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి జయలలితలకు భారతరత్న ఇవ్వాలని విన్నవించారు. దీనికి తోడు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు ఎంజీ రామచంద్రన్ పేరు పెట్టాలని కోరారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో పలు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు తమకు నిధులు కావాలని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇంధన ధరలను తగ్గించాలని నిర్ణయించామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత పొత్తులపై మాట్లాడతామని చెప్పారు.

Related posts

Leave a Comment