మోత్కుపల్లి ఇంటికి విజయసాయిరెడ్డి..

  • హైదరాబాదులో మోత్కుపల్లి నివాసానికి వెళ్లిన విజయసాయి
  • చంద్రబాబును విమర్శించి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి

టీడీపీపై, పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుపై బహిష్కరణ వేటు పడిన సంగతి తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయని మోత్కుపల్లి మౌనంగానే ఉన్నారు. అయితే, మీడియాతో మాట్లాడిన ప్రతిసారీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన పొగుడుతున్నారు. దీంతో, టీఆర్ఎస్ లో ఆయన చేరుతారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మోత్కుపల్లిని కలిసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యత్నించారు. హైదురాబాదులోని మోత్కుపల్లి నివాసానికి ఆయన వెళ్లారు. అయితే, అక్కడ మీడియా ఉండటంతో, వాహనం దిగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related posts

Leave a Comment