మెట్రో ఫ్లాట్‌ఫాంల దగ్గర ప్రయాణికుల నిర్లక్ష్యం
<span style=”font-family: EenaduU;”><span style=”color: #000099;”><span style=”font-size: small;”>నగరంలో రైలు పట్టాలు దాటడం చాలా సహజం. ప్రమాదమని తెలిసినా దూరంగా ఉండే పాదచారుల వంతెన వరకు వెళ్లలేక.. చుట్టూ తిరిగి అక్కడికి చేరుకునే సరికి రైలు పోతుందేమోననే ఆందోళనతో పట్టాలు దాటేస్తుంటారు. సరిగ్గా ఇలాగే మెట్రో రైలు స్టేషన్లలో కొందరు ఫ్లాట్‌ఫాంపై నుంచి పట్టాలు దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామంతో   ఎల్‌ అండ్‌ టీ మెట్రో వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఫ్లాట్‌ఫాం దాటడం నిషేధమని..  అతిక్రమిస్తే జరిమానాతో పాటూ జైలుశిక్ష ఉంటుందనే బ్యానర్లను పెద్ద ఎత్తున ప్రతిస్టేషన్‌లోనూ ప్రదర్శనకు పెట్టారు. ఇటీవల దిల్లీలో ఓ వ్యక్తి ఫ్లాట్‌ఫాం దాటుతుండగా… లోకోపైలెట్‌ అప్రమత్తతతో త్రుటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే.
<span style=”font-family: EenaduU;”><span style=”color: #000000;”><span style=”font-size: small;”>మెట్రోరైలులో నిత్యం ప్రయాణించే వారికి రెండో అంతస్తులో ఉండే ఫ్లాట్‌ఫాంపైకి ఏ వైపు నుంచి వెళితే తమ గమ్యస్థానం చేరుకుంటారో అవగాహన ఉంది. కొత్తగా, మొదటిసారి ప్రయాణించేవారే గందరగోళానికి గురవుతున్నారు. పొరపాటున ఒకవైపు వెళ్లాల్సిన వారు మరో వైపు రెండో అంతస్తులోకి చేరుకుంటే… తిరిగి మొదటి అంతస్తుకు వచ్చి పైకి వెళ్లాలి. తెలియక, కొందరు తొందరపాటుతో మరికొందరు ఫ్లాట్‌ఫాం దాటే ప్రయత్నం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది అక్కడే ఉంటూ పసుపు గీత దాటకుండా వారిస్తున్నారు.
<span style=”font-family: EenaduU;”><span style=”color: #ff0000;”><span style=”font-size: small;”>దిగేవారికి చోటివ్వండి 
<span style=”font-family: EenaduU;”><span style=”color: #000000;”><span style=”font-size: small;”>మెట్రోరైలులో టోకెన్‌ తీసుకోవడం, కార్డు స్వైప్‌ చేయడం వరకు సాంకేతికతను త్వరగానే అర్థం చేసుకున్న హైదరాబాద్‌ ప్రయాణికులు మెట్రోలోకి ఎక్కేటప్పుడు మాత్రం క్రమశిక్షణను పాటించడం లేదు. 20 నుంచి 30 సెకన్ల పాటే స్టేషన్‌లో మెట్రో ఆగుతుందనే తొందరలో దిగేవారికి చోటివ్వడం లేదు. మూడు కోచ్‌లుండే మెట్రోలో… ఒక్కో కోచ్‌లో నాలుగు ద్వారాలు… చాలా విశాలంగా ఉంటాయి. ప్రతి ద్వారం మధ్య భాగాన్ని దిగేవారి కోసం వదిలి అటు ఇటు చివరల నుంచి ప్రయాణికులు ఎక్కాల్సి ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉండే అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌, మియాపూర్‌, జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ, నాగోల్‌, ఉప్పల్‌ స్టేషన్లలో ఎక్కువగా ఈ పరిస్థితి కనిపిస్తోంది.
<span style=”font-family: EenaduU;”><span style=”color: #ff0000;”><span style=”font-size: small;”>63 చోట్ల బ్యానర్లు.. 
<span style=”font-family: EenaduU;”><span style=”color: #000000;”><span style=”font-size: small;”>ఈదురు గాలులు వస్తే మెట్రోరైలు వణుకుతోంది. సిటీలో పలు ప్రాంతాల్లో గాలులకు ఫ్లెక్సీల ఎగిరి వచ్చి ట్రాక్‌పై ఉండే ఓవర్‌హెడ్‌ లైన్లపై పడుతోంది. ఇప్పటి వరకు రెండు మూడుసార్లు రెండు కారిడార్లలోనూ అరగంట పాటూ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అలాంటివి ప్రమాదకరంగా ఎన్నిచోట్ల ఉన్నాయో గుర్తించారు. మొత్తం 63 చోట్ల ఉన్నాయని వాటిని తొలగించాలని ఎల్‌ అండ్‌ టీ మెట్రో జీహెచ్‌ఎంసీకి లేఖ రాసింది.
<span style=”font-family: EenaduU;”><span style=”color: #ff0000;”><span style=”font-size: small;”>పది రోజుల్లో పూర్తయ్యేనా? 
<span style=”font-family: EenaduU;”><span style=”color: #000000;”><span style=”font-size: small;”>ట్రయల్‌రన్స్‌ పూర్తి చేసి నెలాఖరుకల్లా కమిషనర్‌ ఆఫ్‌ మెట్రోరైలు సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్‌) అనుమతిని పొందాలని మంత్రి కేటీఆర్‌ ఎల్‌ అండ్‌ టీ అధికారులను ఆదేశించారు. అందుకు మరో పదిరోజుల గడువే మిగిలి ఉంది. అప్పటివరకు ట్రయల్స్‌ పూర్తి చేయడం అనుమానమే. కనీసం పక్షం రోజులైనా నిర్దేశిత కిలోమీటర్లు ట్రయల్స్‌ నిర్వహించాల్సిందే. ప్రస్తుతం రాత్రింబవళ్లూ ట్రయల్‌రన్స్‌ నిర్వహిస్తున్నారు. ఇంకా చాలా స్టేషన్లలో మెట్రో మార్గాల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి.
<span style=”font-family: EenaduU;”><span style=”color: #ff0000;”><span style=”font-size: small;”>ఒకేవైపు రెండు మెట్రోలు 
<span style=”font-family: EenaduU;”><span style=”color: #000000;”><span style=”font-size: small;”>జులై ఆఖరు నాటికి సిద్ధం చేసేందుకు అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు ట్రయల్‌రన్స్‌ దూకుడు సోమవారం నుంచి పెరిగింది. 16 కిలోమీటర్ల మార్గంలో పలు రైళ్లను అటూఇటూ తిప్పుతూ వేర్వేరు సాంకేతికతలను పరీక్షిస్తున్నారు. ట్రయల్స్‌లో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. సాధారణంగా రెండు ట్రాక్‌లు ఉంటే అటొక మెట్రో వెళితే.. ఇటొక మెట్రో వస్తుంది. ట్రయల్‌రన్‌లో ఆదివారం రోజు ఏకకాలంలో రెండు ట్రాక్‌లపై ఒకేవైపు ప్రయాణించడం విశేషం. ఈ తరహా ప్రయోగాత్మక పరుగులో అన్ని పరీక్షలూ చేస్తుంటారు.
Tags: hyderabad, metro rail, plat form, issues
Related posts
Leave a Comment