మెగా హీరోల మధ్య పోటీలేదు .. ‘విజేత’ కొత్త రిలీజ్ డేట్

తేజు హీరోగా ‘తేజ్ ఐ లవ్ యూ’
వచ్చేనెల 6వ తేదీన రిలీజ్
12వ తేదీన ‘విజేత’ విడుదల
చిరూ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ తొలి చిత్రమైన ‘విజేత ‘ను జూలై 6వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే సాయిధరమ్ ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాను కూడా అదే రోజున రిలీజ్ చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దాంతో మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరి హీరోల సినిమాలు పోటీ పడనున్నాయా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

అయితే ‘విజేత’ సినిమాను జూలై 12వ తేదీన రిలీజ్ చేయాలని నిర్మాత సాయి కొర్రపాటి నిర్ణయించుకున్నారు. చిరంజీవి సూచనమేరకే ఆయన ఈనిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఒకే రోజున మెగా హీరోల సినిమాలు విడుదలైతే తప్పుడు సంకేతాలు బయటికి వెళతాయనీ .. మెగా హీరోల అభిమానుల మధ్య ఒత్తిడి ఉండకూడదని చిరూ చెప్పడం వల్లనే ఆయన ‘విజేత’ను 12వ తేదీకి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ జోడీగా మాళవిక నాయర్ నటించిన సంగతి తెలిసిందే.

Related posts

Leave a Comment