ముగిసిన వాజ్ పేయి అంత్యక్రియలు!

చితికి నిప్పంటించిన దత్త పుత్రిక
హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు
వాజ్ పేయికి కన్నీటీ వీడ్కోలు పలికిన నేతలు
మాజీ ప్రధాని వాజ్ పేయి అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో వాజ్ పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మంచి గంధపు చెక్కల చితిపై వాజ్ పేయి పార్ధివ దేహానికి దత్త పుత్రిక నమిత భట్టాచార్య నిప్పంటించారు. హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితులు వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించారు.

కాగా, బీజేపీ అగ్రనేతలు, అభిమానులు, ఆయన కుటుంబసభ్యులు వాజ్ పేయికి కన్నీటీ వీడ్కోలు పలికారు. వాజ్ పేయి అంతక్రియల్లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment