మా బాస్ పవన్ కల్యాణ్ అంటే అంతే మరి: బండ్ల గణేష్

  • రేణూ దేశాయ్ కి విషెస్ చెప్పిన పవన్
  • ‘దిస్ ఈజ్ మై బాస్’ అన్న బండ్ల గణేష్
  • రెండు చేతులెత్తి మొక్కుతున్న ఎమోజీ కూడా

మరో వివాహానికి సిద్ధమైన తన మాజీ భార్యకు విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్ పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, ‘దిస్ ఈజ్ మై బాస్ పవన్ కల్యాణ్’ అని వ్యాఖ్యానించాడు. ఆపై పవన్ చర్య అద్భుతమంటూ, రెండు చేతులెత్తి మొక్కుతున్నానంటూ ఎమోజీలను ఉంచారు. కాగా, రేణూ దేశాయ్ కి ఇటీవల నిశ్చితార్థం కాగా, తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కల్యాణ్ అభినందనలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తన బాస్ పవన్ కల్యాణ్ అంటే అంతే మరి అన్న అర్థం వచ్చేలా బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

BANDLA GANESH@ganeshbandla

This is my boss @PawanKalyan 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻

Related posts

Leave a Comment