మా`లో వెద‌వ‌లున్నారు…అందుకే ఇలా త‌గ‌ల‌డింది

`మా `సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్లో భాగంగా ఇటీవ‌ల అమెరికా లో జ‌రిగిన ఈ వెంట్ లో భాగంగా వ‌చ్చిన కోటి రూపాయ‌లు నిధులు దుర్వినియోగం అయ్యాయ‌ని అధ్య‌క్షుడు శివాజీ రాజాపై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై నేడు శివాజీ రాజా అండ్ టీమ్ ఖండించింది. తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ అండ్ ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్ వారు చిరంజీవి గెస్ట్ గా రెండు ఈవెంట్ల‌కు హాజ‌రైతే రెండు కోట్ల రూపాయ‌లు వ‌స్తాయ‌ని అన్నారు.

ఆ విధంగానే వాళ్ల‌తో అగ్రిమెంట్ చేసుకున్నాం. ముందుగా అమెరికాలో ఈవెంట్ చేసాం. కోటి రూపాయ‌లు వ‌చ్చాయి. మ‌రో ఈవెంట్ చిరంజీవి గారు సైరా షూటింగ్ పూర్తికాగానే చేస్తాం. ముందుగా వ‌చ్చిన కోటి రూపాయ‌లకు సంబంధించి మా ద‌గ్గ‌ర లెక్కలు క‌రెక్ట్ గా ఉన్నాయి. ఆపై వ‌చ్చిన డ‌బ్బుతో మాకెలాంటి సంబంధం లేదన్నారు ట్రెజ‌ర‌ర్ ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు.

ఇక్క‌డ ఎవ‌రు ఎవ‌రికీ బినామీలు లేరు. వాళ్ల అకౌంట్ల‌లోకి డ‌బ్బు ట్రాన్స్ ఫ‌ర్ అయింద‌ని వ‌చ్చిన వార్త‌ల‌న్నీ అవాస్త‌వం. కొంత మంది కావాల‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. 10 ఏళ్ల నుంచి `మా` సొంత బిల్డింగ్ నిర్మించాల‌ని క‌ల‌లు కంటున్నాం. ఇప్ప‌టివ‌ర‌కూ డ‌బ్బు లేక ఆగిపోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు కొంత మంది `మా` లో ఉన్న వెధ‌వ‌ల కార‌ణంగా చీలిక ఏర్ప‌డింది. ప్రస్తుతం `మా` లో 5లో కోట్ల నిధులున్న‌యి.

సొంతంగా బిల్డింగ్ క‌ట్టుకోవ‌డానికి రెడీ అవుతున్నాం. `మా` ఎన్నిక‌ల‌కు ఇంకా నాలుగు నెల‌లు స‌మ‌యం ఉంది. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోప‌ణ‌లు చేస్తూ `మా` ప్ర‌తిష్ట‌ను రోడ్డుకీడ్చాల్సిన కొంత‌మంది చూస్తున్నారని హేమ ధ్వ‌జ‌మెత్తారు. కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ సంఘాల వారికి సొంతంగా బిల్డింగ్ లు ఎంట‌ర్ ప్రెన్యూన‌ర్ విష్ణు ఇందూరి స‌హకారంతో నిర్మించుకోగ‌లిగారు. కానీ `మా` మాత్రం ఆ అవ‌కాశం వ‌చ్చినా స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయింది.

మురళీ మోహాన్ హయంలో విష్ణు ఇందుకూరి సొంతంగా బిల్డింగ్ నిర్మిస్తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చారు . కానీ దాన్ని కొంత‌మంది చెడ‌గొట్టారు. ఇప్పుడేమో ఇలా ప‌డి ఏడుస్తున్నారు. అయినా ఎవ‌రు ఎలా ఏడ్చినా? సొంతంగా ఈ ఏడాది బిల్డింగ్ నిర్మిస్తామ‌ని వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అన్నారు. అమెరికాకు వెళ్లిన వారంద‌రిలో ఆర్టిస్టులు లేరని, బంధు ప్రీతి చూపించార‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌లు శ్రీకాంత్ ఖండిచారు. అమెరికాకు వెళ్లిన వారంతా ఆర్టిస్టులే. కొంత మంది డాన్స‌ర్లు, జ‌బ‌ర్ ద‌స్త్ టీమ్ స‌భ్యులు ఉన్నారు. దానికి సంబంధించి మా ద‌గ్గ‌ర ఓ లిస్ట్ ఉంది. అది గూగుల్ ల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంద‌న్నారు.

Related posts

Leave a Comment