మార్పు కనిపిస్తోందంటున్న రాశిఖన్నా

బన్నీ సినిమా వేడుకకు పవన్
షారుఖ్ సినిమాలో మాధవన్
* వ్యక్తిగతంగానే కాకుండా ఆర్టిస్టుగా కూడా తనలో మెచ్యూరిటీ కనిపిస్తోందని చెబుతోంది కథానాయిక రాశిఖన్నా. “నిన్న నటించిన సినిమా కన్నా ఈవేళ నటించిన సినిమాలో నా నటనలో బెటర్ మెంట్ కనిపిస్తోంది. ఈ తేడా నాకే స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా మెచ్యూరిటీ రావడం అన్నది నాకు వృత్తిపరంగా ఎంతో సంతోషాన్ని ఇస్తోంది” అని చెప్పింది.
* అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం సక్సెస్ మీట్ ను ఈ నెల 10న హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడు.
* తాజాగా అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రంలో నటిస్తున్న తమిళ నటుడు మాధవన్ త్వరలో ఓ బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు. షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జీరో’ చిత్రంలో గెస్ట్ పాత్రలో నటించడానికి మాధవన్ ఓకే చెప్పాడు.

Related posts

Leave a Comment