మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలో ‘చిచ్చు’ పెట్టిందెవరు..?

మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు అకాల మరణంతో నగరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఎవరినీ నియమించకుండా జాప్యం చేయడం అనేక సమస్యలను తెచ్చిపెట్టింది. ఇంతకు ముందే కుమారులిద్దరినీ పిలిపించి కూర్చుండబెట్టి…ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్సీ, ఒకరికి ఎమ్మెల్యే ఇస్తానని బాధ్యతగా చెప్పాల్సిన ‘చంద్రబాబు’ అన్నదమ్ముల తీరుతో ఆగ్రహంతో ‘ముద్దు’ భార్యకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇచ్చారు. ఆ తరువాత అసలు సమస్యలు బయటపడ్డాయి. ‘ముద్దు’ జీవించి ఉన్నంత కాలం ఆయన వెన్నంటే ఉండే వారు ఆయన కుమారుల్లో ఒకరు. అతనే తన రాజకీయ వారసుడు..అని ‘ముద్దు’ చెబుతుంటే వారు.

కుటుంబానికి ఆర్థిక వనరులు ఎంత వరకు ఉన్నాయో లేదో..కానీ…అపారమైన ఓటర్ల మద్దతు మాత్రం ‘ముద్దు’ సంపాదించిపెట్టారు. అసలు విషయానికి వస్తే…నగరి నుంచి పార్టీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తే విజయం సాధిస్తారు..? ‘చంద్రబాబు’ సర్వే చేయించగా ‘ముద్దు’ కుటుంబానికి చెందిన వారు ఎవరైనా విజయం సాధిస్తారు…అని బయటపడింది. అంతకు ముందు..వేరే సామాజికవర్గానికి ఈ సీటు ఇవ్వాలని భావించినా..ఆ నివేదికతో ‘ముద్దు’ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే జరగవల్సిన నష్టం జరిగిపోయింది.

‘ముద్దు’ జీవించినంత కాలం ఆయన వెనుక ఉన్న ‘భాను’కు ఎమ్మెల్సీ ఇస్తే పరిస్థితి సద్దుమణిగేది. మరొకరికి ఎమ్మెల్సీ ఇస్తే పరిస్థితి చక్కపడేది. కానీ..కాలయాపనతో అన్నదమ్ముల మధ్య గొడవలు పెరిగిపెద్దవయ్యాయి. ఒకవేళ ‘ముద్దు’ కుటుంబానికి అవకాశం ఇవ్వకపోతే…ఆ కుటుంబానికి చెందిన వారిని పార్టీలో చేర్చుకుని వారికి టికెకట్‌ ఇవ్వడానికి ‘జగన్‌’ సిద్దంగా ఉన్నారట. తిరుమల జెఇఒ శ్రీనివాసరాజు, విద్యాసంస్థల అధిపతి అశోక్‌రాజు, పుంగనూరు టిడిపి అభ్యర్థిగా ఓడిపోయిన వెంకటరామరాజు నగరి బరిలోకి దించాలని ‘చంద్రబాబు’ భావించాన…స్థానికంగా…ముద్దు కుటుంబంపై ఉన్న అభిమానం బయటపడడంతో..ఆ ప్రతిపాదనను విరమించుకుని…అన్నదమ్ముల్లో ఒకరికి ఇచ్చేందుకు పిలిపించి మంతనాలు జరుపుతున్నారు.

ఎమ్మెల్సీ అయిన ‘ముద్దు’ భార్య డబుల్‌గేమ్‌ ఆడి అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించారనే మాట ఉంది. అప్పుడే పెద్దకుమారుడికి ఎమ్మెల్యే, చిన్న కుమారుడికి ఎమ్మెల్సీ ఇస్తే …బాగుండేదని ‘చంద్రబాబు’కు చెపితే సమస్య ఉండేది కాదని చెబుతున్నారు. ఆమె ఎందుకు ఈ విధంగా వ్యవహరించిందో కానీ…అలా చెప్పలేదని అంటున్నారు. ఏది ఏమైనా ‘ముద్దు’ కుమార్లో ఒకరికి టిక్కెట్‌ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. జీవించి ఉన్నప్పుడు అనేక విధాలుగా సత్తా చూపిన ‘ముద్దు’ చనిపోయిన తరువాత తన ప్రతిష్టను కుమారులకు ఇచ్చారు…? ఏదైనా హ్యాట్సాఫ్‌ ముద్దు అని చెప్పవచ్చు.
Tags: mudhu krishnana naidu, nagari constancy,mlc

Related posts

Leave a Comment