మహేష్‌బాబు @25గా ‘మహర్షి’..!

అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు 25వ చిత్రం ఫ‌స్ట్‌లుక్ రానేవ‌చ్చింది. మ‌హేశ్ బాబు పుట్టిన‌రోజు కానుక‌గా చిత్రం బృందం ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మహర్షి’గా నామకరణం చేశారు. ‘మీట్‌ రిషి’ పేరుతో ఈ సినిమా పోస్టర్‌, టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మహేశ్‌ స్టైల్‌గా నడుచుకుంటూ వస్తూ..పక్కన అమ్మాయిలను చూసుకుంటూ వెళ్లడం టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మరింత ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మహేష్ రిషిగా ఓ కొత్త లుక్‌లో క‌నిపిస్తున్నారు. మ‌హేశ్‌కు జోడిగా పూజా హెగ్డే న‌టిస్తున్నారు. హీరో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. కేయూ మోహనన్‌ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు 25వ చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ‌స్ట్‌లుక్‌కు ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. డెహ్రాడూన్‌, హైదరాబాద్‌, గోవాలో షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్ర నిర్మాణ పనులు ఏకధాటిగా కొనసాగుతున్నాయి. 2019 ఏప్రిల్‌ 5న ప్రపంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు.
Tags: mahesh babu, 25th film ,updates,maharshi

Related posts

Leave a Comment