మళ్లీ కొడుకుతోనే పూరి మూవీ?

  • ఆకాశ్ హీరోగా వచ్చిన ‘మెహబూబా’
  • నిరాశ పరిచిన ఫలితం 
  • మరో ప్రయత్నంలో పూరి  

పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ హీరోగా ‘మెహబూబా’ సినిమా చేశాడు. ప్రేమకథాంశంతో ఆకాశ్ ను హీరోగా నిలబెడదామని చెప్పేసి .. తనే నిర్మాతగా భారీ మొత్తమే ఖర్చుపెట్టాడు. అయితే ఆశించినస్థాయిలో యూత్ కు ఈ సినిమా కనెక్ట్ కాలేకపోయింది. ఆకాశ్ కి నిరాశను మిగల్చడమే కాకుండా .. పూరికి నష్టాలు తెచ్చిపెట్టింది.

దాంతో ఇప్పట్లో కొడుకు హీరోగా ఆయన సినిమా ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ తన నెక్స్ట్ మూవీని కూడా కొడుకుతోనే చేయడానికి పూరి రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. అందుకోసం తనే ఒక కథను సిద్ధం చేస్తున్నాడనే టాక్ బలంగావుంది. ఈ సినిమాకి కూడా నిర్మాతగా పూరి పేరే వినిపిస్తోంది. కథపై కసరత్తు పూర్తి చేసిన తరువాతనే పూరి సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు. అదే నిజమైతే ఈ సినిమాతోనైనా ఆకాశ్ హిట్ కొడతాడేమో చూడాలి.

Related posts

Leave a Comment