మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తూ…కారు బోల్తా పడి ఇద్దరి మృతి..

చేర్యాల: సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా… ఆరుగురు గాయపడ్డారు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన 8 మంది యువకులు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి ఆదివారం వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విష్ణు ప్రసాద్‌(18), బాలరాజు(25) మృతి చెందారు. క్షతగాత్రులను చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు కొమరవెల్లి ఎస్సై సతీశ్‌ తెలిపారు.

Related posts

Leave a Comment