మరోమారు రికార్డులకెక్కిన రోహిత్ శర్మ!

టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన తొలి ఇండియన్
56 బంతుల్లో అజేయ సెంచరీ
వరుస వైఫల్యాల తర్వాత రెచ్చిపోతున్న స్టార్ ఆటగాడు
వరుస వైఫల్యాల తర్వాత బ్యాట్ ఝళిపిస్తున్న టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన మూడో టీ20లో అజేయ సెంచరీ సాధించిన రోహిత్.. టీ20ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు.

బ్రి‌స్టల్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ వీర విజృంభణ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే వంద పరుగులు పిండుకున్నాడు. ఇందులో 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కాగా, ఓవరాల్‌గా రోహిత్ ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్. న్యూజిలాండ్‌ ఆటగాడు కోలిన్ మన్రో కూడా టీ20ల్లో మూడు సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో రోహిత్ ఉన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Related posts

Leave a Comment