మన ముఖ్యమంత్రి అద్భుతమైన నటుడు!: పవన్ కల్యాణ్

ప్రత్యేక హోదా’పై మాట మార్చింది నేను కాదు బాబే
చంద్రబాబు చెప్పిన మాటలు ఆయనే మర్చిపోయారు!
బాబు మాటలు రికార్డు చేసి చూపించినా కాదంటారు!
ప్రత్యేక హోదా సాధన కోసం మొదటి నుంచి తాము పోరాడుతున్నామని, ‘హోదా కావాలి’ అనే మాటమీదనే ఉన్నామని, దానిని వ్యతిరేకించింది, మాట మార్చింది సీఎం చంద్రబాబేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, ‘మన ముఖ్యమంత్రి అద్భుతమైన నటుడు. ఆయన చెప్పిన మాటలు ఆయనే మర్చిపోయారు. ‘స్పెషల్ కేటగిరి స్టేటస్ వద్దని నేను చెప్పలేదు’ అని ఆయన (చంద్రబాబు) అంటారు. ఆయన మాటలు ఆయనకు రికార్డు చేసి చూపించినా.. సాక్ష్యం చూపించినా కూడా, ‘ఎవరో అన్నారు నేను కాదు’ అని ఆయన అంటారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Tags: pawankalyan, chandra babu naidu, special status

Related posts

Leave a Comment