మన చెస్ క్వీన్ పెళ్లి చేసుకుంటోంది

తెలుగు గడ్డ వచ్చిన గొప్ప చెస్ ప్లేయర్లలో ద్రోణవల్లి హారిక ఒకరు. చిన్న వయసులోనే ప్రతిభ చాటుకుని ప్రపంచ స్థాయికి ఎదిగిందీ గుంటూరు అమ్మాయి. తనకంటే ముందు ఈ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన కోనేరు హంపికి దీటుగా ప్రదర్శన చేసి.. ఆమె కంటే ఉన్నత స్థానానికి ఎదిగింది హారిక. ఈ అమ్మాయి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. 27 ఏళ్ల ఈ గ్రాండ్ మాస్టర్ ఆగస్టు 19న పెళ్లి చేసుకోబోతంది. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి కుటంబం నడుపుతున్న వ్యాపారం చూసుకుంటున్న కార్తీక్ చంద్ర అనే కుర్రాడిని హారిక వివాహమాడనుంది. అతను ఆంధ్రా ప్రాంతానికి చెందినవాడని అంటున్నారు. ఈ నెల 18న హైదరాబాద్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో హారిక-కార్తీక్ ల నిశ్చితార్థం జరగబోోతంది.

హారిక 1991 జనవరి 12న గుంటూరులో జన్మించింది. అండర్-9 స్థాయిలోనే ఆమె జాతీయ ఛాంపియన్ షిప్ లో పతకం గెలిచి సత్తా చాటుకుంది. ఆ తర్వాత జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. హంపి తర్వాత దేశంలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రెండో మహిళా క్రీడాకారిణి హారికనే. 2016లో చైనాలో నిర్వహించిన ఫిడె ప్రపంచ మహిళల గ్రాండ్ ప్రి చెస్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించడం హారిక కెరీర్లో అతి పెద్ద విజయం. 2015లో ప్రపంచ మహిళల ఆన్ లైన్ బ్లిట్జ్ ఛాంపియన్ షిప్ లోనూ హారిక విజేతగా నిలిచింది. హారిక అక్కను ‘పవర్’.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’.. ‘జై లవకుశ’ చిత్రాల దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబీ) పెళ్లి చేసుకోవడం విశేషం. అతను హారికకు ముందు నుంచి మంచి సపోర్ట్ గా ఉంటున్నాడు. ఆమెకు సంబంధం కుదర్చడంలోనూ బాబీ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

Related posts

Leave a Comment