మంత్రి పదవులు వాళ్లకిచ్చి.. నాకు ఇయ్యకుండా పోతాడా చంద్రబాబు?: జేసీ

నేను చంద్రబాబుని పొగడను
ఎందుకంటే నాకు ఆయన చేసిందేమీ లేదు
చంద్రబాబు చేసిన మంచిపనులను మాత్రం చెప్పాల్సిన బాధ్యత ఉంది
కియా కంపెనీ రావద్దని తెల్లగడ్డం వేసుకుని మోదీ అడ్డుపడ్డారు
తాను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పొగడనని, ఆయన తనకు ఇప్పించింది, చేసింది ఏమీ లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వేదికపై తనదైన శైలిలో మాట్లాడారు. “కాల్వ శ్రీనివాసులు, సునీతమ్మ నాకన్నా ఎంత జూనియర్లు? మంత్రి పదవులు వాళ్లకిచ్చి నాకు ఇయ్యకుండా పోతాడా చంద్రబాబు? వాళ్లకొచ్చిందని నాకు బాధ లేదు. నాకు రాలేదనే నా బాధ. చంద్రబాబుని పొగడను.. కానీ ఆయన చేసిన మంచిపనులను మాత్రం చెప్పాల్సిన బాధ్యత ఉంది.

జగన్‌ మీ ఊరికి వెళ్లి చూడు.. నేను మొన్ననే పులివెందుల బార్డరుకి వెళ్లి వచ్చాను.. వారికి నీరు అందుతోంది. ఇక జగన్‌కు బుద్ధి రాకపోతే ఆ ఏసు ప్రభువే ఆయనను కాపాడాలి. ఇక కియా మోటర్స్‌ కంపెనీ ఒక్కటి తప్ప మరొకటి మనకు లేదు. తెల్లగడ్డం వేసుకుని నరేంద్ర మోదీ ఉన్నారు… కియా మోటర్స్ ప్రతినిధులకు ఐదు సార్లు ఫోన్‌ చేసి ఏపీలో ఆ కంపెనీ వద్దని గుజరాత్‌లో పెట్టాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.

కానీ, చంద్రబాబు నాయుడు మాయ, మర్మం చేసి వాళ్లకేం లడ్డూ పెట్టారో నాకు తెలియదు.. ఆయన చాతుర్యానికి హ్యాట్సాఫ్‌.. కియా మోటర్స్‌ మనకే వచ్చింది. చంద్రబాబుకి గడ్డం పట్టుకోవడం తెలుసు, కాళ్లు పట్టుకోవడం తెలుసు.. చేతులు పట్టుకోవడం తెలుసు.. జుట్టు పట్టుకోవడం తెలుసు” అని జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు.

Related posts

Leave a Comment