మంచుకొండల్లో ఐదుగురు తెలుగువారి మృతి… కనిపించకుండా పోయిన దంపతులు!

భారీ వర్షాలతో ఆగిన అమర్ నాథ్ యాత్ర
కైలాస మానస సరోవరం యాత్ర కూడా
తీవ్ర ఇబ్బందులు పడుతున్న యాత్రికులు
ఈ సంవత్సరం అమరనాథుడిని, కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని వెళ్లిన భక్తులకు తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలు, అనుకూలించని వాతావరణంతో బేస్ క్యాంపుల్లోనే చిక్కుపోయి, వేలాది మంది ఎటూ కదల్లేక అవస్థలు పడుతుండగా, వివిధ కారణాలతో పలువురు మరణించారు. వీరిలో ఐదుగురి తెలుగువారు కూడా ఉండగా, వారి మృతదేహాలు ఎప్పటికి స్వస్థలాలకు చేరతాయో తెలియని పరిస్థితి నెలకొని వుంది. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం, అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన లక్ష్మీనారాయణ స్వామి, కాకినాడకు చెందిన గ్రంథి సుబ్బారావులతో పాటు మరో ఇద్దరు మరణించారు. అనంతపురం నగరంలో శ్రీనేత్ర ఆసుపత్రి డైరెక్టర్ కేదార్ నాథ్ం ఆయన భార్య స్వరాజ్య లక్ష్మి ఎక్కడున్నారన్న ఆచూకీ తెలియడం లేదు. దాదాపు 1500 మంది మంచుకొండల్లో చిక్కుకున్నట్టు తెలుస్తుండటంతో సైన్యం రంగంలోకి దిగింది. తెలుగు రాష్ట్రాల అధికారులు జమ్మూ కాశ్మీర్, నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరిపి, అవస్థలు పడుతున్న తెలుగు వారిని తిరిగి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు యాత్రికుల తరలింపునకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నామని ఉత్తరాఖండ్ డీజీపీ అనిల్ వెల్లడించారు.

Related posts

Leave a Comment