భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటా: కపిల్ దేవ్

ఆహ్వానం వచ్చిందో, లేదో ఇంకా తెలియదు
ఇన్విటేషన్ వస్తే కచ్చితంగా వెళ్తా
కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటా
పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తెలిపారు. అయితే తనకు ఇమ్రాన్ నుంచి ఆహ్వానం అందిందో, లేదో ఇంకా తెలియదని… ఒకవేళ ఆహ్వానం వస్తే కచ్చితంగా వెళ్తానని, ఇమ్రాన్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా చూస్తానని చెప్పారు.

అయితే భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఈ నెల 11న పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సిద్ధూలకు ఆహ్వానాలు అందాయి. పాకిస్థాన్ కు వెళ్తున్నానని సిద్ధూ ఇప్పటికే ప్రకటించగా… గవాస్కర్ ఇంకా స్పందించలేదు.

Related posts

Leave a Comment