భారతీయులపై ట్రంప్ మరో పిడుగు.. హెచ్‌-1బీ వీసాలపై త్వరలో షాకిచ్చే ప్రకటన!

హెచ్-4 వీసాల జారీ ఎత్తివేయాలని నిర్ణయం
అదే జరిగితే 72 వేల మంది భారతీయులపై ప్రభావం
జూన్ నుంచే అపివేయనున్నట్టు సమాచారం
భారతీయులపై మరో పిడుగు వేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కారు సిద్ధమైంది. అమెరికాలో హెచ్-1బీ వీసాలున్నవారి జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పించే హెచ్-4 వీసాల జారీని ఎత్తివేయాలని నిర్ణయించింది. అదే జరిగితే 72 వేల మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జూన్-జూలై నుంచి ఈ వీసాల పర్మిట్లను ఆపివేయనున్నట్టు అమెరికా పౌరసత్వం-వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) ప్రకటించడంతో భారతీయులు నీరుగారిపోయారు. అయితే కొత్త నిబంధనలను అమలు చేసేముందు ప్రజాభిప్రాయం తీసుకుంటామని యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్ ప్రాణ్సిస్ సిస్నా తెలిపడం కొంత ఊరటనిచ్చే విషయం.

హెచ్-4 వర్క్ పర్మిట్లుగా పిలిచే ఎంప్లాయిమెంట్ అథరైజేషన్ డాక్యుమెంట్స్ (ఈఏడీ) కలిగిన వారు గతేడాది జూన్ నాటికి మొత్తం 71,287 మంది అమెరికాలో ఉన్నారు. వీరిలో 71 వేల మంది భారతీయులు కాగా, అందులో 93 మంది మహిళలు కావడం గమనార్హం.

Related posts

Leave a Comment