‘భారతీయుడు 2’లోను కమల్ ద్విపాత్రాభినయం?

  • కమల్ హీరోగా ‘భారతీయుడు 2’
  • కీలకమైన పాత్రలో అజయ్ దేవగణ్
  • కథానాయికగా తెరపైకి నయన్ పేరు

దర్శకుడిగా శంకర్ కెరియర్లోనూ .. కథానాయకుడిగా కమల్ కెరియర్లోను చెప్పుకోదగిన సినిమాగా ‘భారతీయుడు’ నిలిచింది. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా కమల్ ద్విపాత్రాభినయం చేశాడు. సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి శంకర్ రంగంలోకి దిగాడు. ఈ సినిమాలోను కమల్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం.

అయితే ఆ పాత్రల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? ఆ పాత్రల తీరుతెన్నులు ఎలా వుండనున్నాయి? అనే విషయమే తెలియాల్సి వుంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ప్రధాన కథానాయికగా నయనతార పేరు వినిపిస్తోంది. నయనతారను తీసుకోవడమంటూ జరిగితే ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

Leave a Comment