‘భరత్’ లో ఆ సీన్ చూసి చప్పట్లు కొట్టేశాను: చిరంజీవి

‘భరత్ అనే నేను’ తొలి రోజునే చూశాను
కొరటాల పనితీరు ప్రశంసనీయం
మహేశ్ బాబు నటన అద్భుతం
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ ‘భరత్ అనే నేను’ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. రికార్డు స్థాయి వసూళ్లతో ఈ సినిమా అన్ని ప్రాంతాల్లోనూ తన హవాను కొనసాగిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో వున్న చిరంజీవి అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ ‘భరత్ అనే నేను’ సినిమాను గురించి ప్రస్తావించారు.”మా ఇంట్లోని వాళ్లందరూ మహేశ్ బాబును ఎక్కువగా ఇష్టపడతారు. అందువలన కుటుంబసభ్యులందరితో కలిసి తొలి రోజునే ఈ సినిమాను ఇంట్లోనే చూశాను. కమర్షియల్ హంగులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ఈ సినిమా స్థాయి పెరిగింది. ఇక మహేశ్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు .. అద్భుతంగా చేశాడు. వెంటనే మహేశ్ కి ఫోన్ చేసి అభినందించాను కూడా. ఈ సినిమా చివరిలో వచ్చే విలేకరుల సమావేశం సీన్ కు నేను బాగా కనెక్ట్ అయ్యాను. జర్నలిస్టులను మహేశ్ ప్రశ్నిస్తున్నప్పుడు ఆనందంతో చప్పట్లు కొట్టేశాను” అంటూ చెప్పుకొచ్చారు.

Related posts

Leave a Comment