భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలంలో గోదావరి పోటెత్తింది. ఉరకలు పరుగులూ పెడుతూ ఉగ్రరూపం దాల్చింది. రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాలతో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతోంది. నిన్న 32.5 అడుగులు ఉన్న నీటి మట్టం ఈ రోజు ఉదయం 9 గంటలకు 34.5 అడుగులకు పెరిగింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో భద్రాలచలంలోని స్నానఘట్టాలు వరద నీటిలో మునిగి పోయాయి. గతనెలలో భద్రాచలం వద్ద వరద తాకిడి 33 అడుగుల వరకూ మాత్రమే వచ్చింది. ఈసారి 34.5 అడుగులు దాటి ప్రవహించడంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ సమయంలోనైనా వరద నీరు తమ ఇళ్లలోనికి వచ్చే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. వరద నీరు పెరిగే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Related posts

Leave a Comment