బ్రేకింగ్… మాజీ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ కన్నుమూత

89 సంవత్సరాల వయసులో కన్నుమూత
కోల్ కతాలోని ప్రైవేటు ఆసుపత్రిలో గత కొంతకాలంగా చికిత్స
సంతాపం వెలిబుచ్చిన పలువురు ప్రముఖులు
లోక్ సభ మాజీ స్పీకర్, కమ్యూనిస్ట్ సీనియర్ నేత సోమనాథ్ చటర్జీ కొద్దిసేపటి క్రితం మరణించారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన శరీరంలోని అవయవాలు దెబ్బతిని చికిత్సకు స్పందించడం లేదని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు రెండు రోజుల క్రితం నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమనాథ్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.

Related posts

Leave a Comment