బ్రేకింగ్ న్యూస్… ముమ్మిడివరం మండలంలో గోదావరిలో పడవ బోల్తా

తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
19 మందితో వెళుతున్న పడవ
సహాయక చర్యలు ప్రారంభం
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో ఈ ఉదయం ఓ మరపడవ బోల్తా పడింది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం గుజాపులంక వద్ద ఈ ఘటన జరిగింది. పడవ నదిని దాటుతున్న సమయంలో అందులో 19 మంది వరకూ ఉన్నట్టు తెలుస్తుండగా, కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు రాగలిగారని ప్రాథమిక సమాచారం.

విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ఘటనలో మృతులు ఎవరైనా ఉన్నారా? వారి వివరాలు ఏంటన్న విషయం తెలియాల్సి వుంది.

Related posts

Leave a Comment