బ్రేకింగ్… ఎట్టకేలకు ఢిల్లీలో పట్టుబడిన ‘అగ్రీగోల్డ్’ అవ్వాస్ సీతారాం!

ఢిల్లీలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు
కేసు నమోదైనప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న సీతారాం
నేడో, రేపో విజయవాడకు తరలింపు
అగ్రీగోల్డ్ మోసం బయటకు వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న సంస్థ వైస్ ప్రెసిడెంట్ అవ్వాస్ సీతారాం ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఇప్పటికే అరెస్ట్ కాబడిన చైర్మన్ అవ్వాస్ వెంకట రామారావుకు ఈయన స్వయానా సోదరుడు. సీతారాంను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా సీతారాంను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన అధికారులు, ఆయన ఢిల్లీలో తలదాచుకున్నారని తెలుసుకుని ట్రాప్ చేశారు. ఏపీ నుంచి వెళ్లిని సీఐడీ అధికారులు, ఢిల్లీలో సీతారాంను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆది నుంచి సీతారాం ప్రమేయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన ఆయన్ను, నేడో, రేపో న్యూఢిల్లీ నుంచి విజయవాడకు తరలిస్తామని అధికారులు వెల్లడించారు.

Related posts

Leave a Comment