‘బ్యాడ్‌ టచ్‌’ గురించి బయటపెట్టిన గాయని

టీన్స్‌లో ఉన్నప్పుడు కిల్‌పాక్‌ (చెన్నై) బ్రిడ్జ్‌ దగ్గర ఒక ఈవ్‌ టీజింగ్‌ ఇన్సిడెంట్‌ వల్ల నా బైక్‌ యాక్సిడెంట్‌ అయి పడిపోయాను. నా కుడిచేయి కొట్టుకుపోయి.. కదల్లేని స్థితిలో నేనుంటే కొంతమంది మగవాళ్లు పడిపోయిన నా దగ్గరకు వచ్చి నా షర్ట్‌ జేబుల్లో ఏముందో చూసే వంకతో నా చెస్ట్‌ టచ్‌ చేసే ప్రయత్నం చేశారు. ఎంత నీచమైన ప్రవర్తన? ఇలాంటిది చాలామంది అమాయిలకు ఎదురయ్యే ఉంటుంది. నాకు పందొమ్మిదేళ్లప్పుడు.. మళ్లీ ఇంకో సంఘటన. ఈసారీ ఓ పెద్ద మనిషే. తన ఆఫీస్‌కు పిలిచాడు. నేను, అమ్మ ఇద్దరం వెళ్లాం. కాని నన్నొక్కదాన్నే లోపలికి రమ్మన్నాడు. బాగా పరియం ఉన్న వ్యక్తే కాబట్టి వేరే అనుమానాలు లేకుండా.. అసలు రాకుండా.. ఆయన క్యాబిన్‌లోకి వెళ్లాను. ఆయన టేబుల్‌ వెనకనుంచి వచ్చి.. నన్ను హగ్‌ చేసుకున్నాడు.. అసభ్యంగా ప్రవర్తించబోయాడు.

చిన్మయి.. గత మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో బెదిరింపులు, వేధింపులనూ ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించి ఫిర్యాదూ చేసింది. వాళ్లు అరెస్టయ్యారు కూడా. అయితే అరెస్ట్‌ అయిన తర్వాతా ట్రోలింగ్‌ ఆగలేదు.పేరొందిన మహిళా రచయితలు, కార్యకర్తలూ ఆమెను ట్రోల్‌ చేశారు.. ‘మయ్యా.. మయ్యా.. లాంటి పాటపాడిన సింగర్‌ .. వేధింపులకు వ్యతిరేకంగా కంప్లయింట్‌ చేయకూడదు’ అనే కామెంట్స్‌తో! చాలామంది మగవాళ్లు, ఆడవాళ్లు సపోర్ట్‌ ఇచ్చారు ఆ మాటలకు. అంతేకాదు చిన్మయి మీద యాసిడ్‌ అటాక్‌ చేయాలని, రేప్‌ చేయాలని ఆగ్రహించిన మగవాళ్లూ ఉన్నారు. ఆడవాళ్లే ఆడవాళ్లకు సపోర్ట్‌ చేయని పరిస్థితి అని వాపోయింది చిన్మయి. ఇలా చిన్మయి మీద ఆన్‌లైన్లో కక్కుతున్న విషం చదివి.. యూట్యూబ్‌లో సినిమా రివ్యూలు చెప్పే ప్రశాంత్‌ అనే క్రిటిక్‌.. చిన్మయికి తాను సపోర్ట్‌ చేస్తున్నాను అని చెబుతూ వెంటనే ‘‘డోంట్‌ వర్రీ స్వీట్‌హార్ట్‌/ డార్లింగ్‌.. ఐ విల్‌ సపోర్ట్‌ యూ’’ అని ట్వీట్‌ చేశాడు. ఆయనలా స్వీట్‌హార్ట్, డార్లింగ్‌ అని పిలవడం చిన్మయికి చిరాకు తెప్పించింది. వెంటనే ‘‘డోంట్‌ కాల్‌ మి స్వీట్‌హార్ట్‌’’ అని రిటార్ట్‌ ఇచ్చి ప్రశాంత్‌కి సంబంధించిన డైరెక్ట్‌ మెస్సేజెస్‌ అన్నీ డిలీట్‌ చేసేసింది చిన్మయి. ఇక అప్పటినుంచి ప్రశాంత్‌ కూడా చిన్మయికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మెుదలుపెట్టాడు. అప్పటిదాకా చాలా ఉదాత్తంగా మద్దతునిస్తానన్నవాడు తన అతిని ఆమె తిప్పికొట్టేటప్పటికి అసలు స్వభావం బయటపెట్టుకున్నాడు.

Related posts

Leave a Comment