బీజేపీని ఆదుకునేది హిందుత్వ అజెండానే.. అభివృద్ధి కాదు: సుబ్రహ్మణ్యస్వామి

హిందూ అజెండానే బీజేపీకి విజయాన్ని అందిస్తుంది
హిందువును జమ్ముకశ్మీర్ సీఎంగా చేయాలి
పీడీఎఫ్ లో హిందువు ఉంటే.. వారిని సీఎం చేయాలి
బీజేపీని అధికారంలోకి తెచ్చేది హిందుత్వ అజెండానే అని ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. వాజ్ పేయి హయాంలో ‘ఇండియా షైనింగ్’ నినాదంలో ఎన్నికల బరిలోకి బీజేపీ దిగిందని… కానీ, ఓటమిపాలైందని చెప్పారు. బీజేపీకి అభివృద్ధి నినాదం పని చేయదని అన్నారు. గత ఎన్నికల్లో హిందుత్వ స్థాపన, అవినీతి రహిత ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో బీజేపీ ఎక్కువ సీట్లను సాధించిందని చెప్పారు. బీజేపీకి మరో ఐదేళ్ల పాటు అధికారాన్ని ఇస్తే… తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేరుస్తుందని తెలిపారు. జమ్ముకశ్మీర్ లో హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పారు. ఒకవేళ పీడీఎఫ్ లో హిందువు కానీ, సిక్కు కానీ ఉంటే… వారినే సీఎం చేయాలని సూచించారు.

Related posts

Leave a Comment