బిట్ కాయిన్ కుంభకోణంలో శిల్పాశెట్టి భర్తకు ఊరట? సన్నీలియోన్, నేహాధూపియాల విచారణ?

  • కుంద్రాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవన్న విచారణాధికారి
  • స్కామ్ సూత్రధారి భరద్వాజ్ తో కుంద్రాకు సంబంధాలు ఉన్నాయని అనుమానం
  • పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారించనున్న ఈడీ

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బిట్ కాయిన్ స్కాములో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు నుంచి ఆయన బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణలో రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని విచారణాధికారి, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ మనీషా జెందే తెలిపారు. ఈ స్కామ్ కు సూత్రధారిగా భావిస్తున్న భరద్వాజ్ అనే వ్యక్తితో కుంద్రాకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు, ఈ స్కామ్ లో పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారించవచ్చని తెలుస్తోంది. వీరిలో సన్నీలియోన్, నేహాధూపియా, ప్రాచీ దేశాయ్, కరిష్మా తన్నా, జరీన్ ఖాన్, సోనాల్ చౌహాన్, ఆర్తి ఛబ్రియా, నర్గీస్ ఫక్రీ, హ్యూమా ఖురేషీలు ఉన్నట్టు సమాచారం.

Related posts

Leave a Comment