‘బిగ్ బాస్’ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హెబ్బా పటేల్!

బిగ్ బాస్ సీజన్-1తో పోల్చితే సీజన్-2కు తగ్గిన రేటింగ్స్
గ్లామర్ అద్దే యోచనలో బిగ్ బాస్ టీమ్
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హెబ్బా పటేల్
ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్-1 ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. దీంతో, నాని హోస్ట్ గా సీజన్-2 భారీ అంచనాల మధ్య మొదలైంది. అయితే, ఎన్టీఆర్ ఆకట్టుకున్నంతగా నాని ఆకట్టుకోలేకపోతున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. షోలో ఉన్న పార్టిసిపెంట్లు కూడా పెద్ద సెలబ్రిటీలు కాకపోవడం కొంత వెలితిగా ఉందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, షోకు కొంచెం గ్లామర్ అద్దడం ద్వారా మంచి రేటింగ్స్ సాధించాలనే భావనలో బిగ్ బాస్ టీమ్ ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలో, యంగ్ హీరోయిన్ హెబ్బాపటేల్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తోందట. ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని సమాచారం. ఈ వీకెండ్ లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Related posts

Leave a Comment