‘బిగ్‌బాస్‌-2’ నుంచి బాబు గోగినేని ఔట్‌

బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌-2’ హౌస్‌‌ నుంచి బాబు గోగినేని ఎలిమినేట్‌ అయ్యారు. యువ కథానాయకుడు నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ రెండో సీజన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. జూన్‌ 10న ప్రారంభమైన ఈ షోలో మొత్తం 16 మంది పాల్గొన్నారు. వీరిలో తనీశ్‌, గీతామాధురి, శ్యామల, బాబుగోగినేని, రోల్‌ రైడా, సామ్రాట్‌, అమిత్‌, దీప్తి, భాను శ్రీ, కిరీటి, దీప్తీ సునయన, కౌశల్‌, తేజస్వీ, గణేష్‌, సంజన, నూతన్‌ నాయుడు ఉన్నారు. ఇప్పటి వరకు ఎలిమినేట్‌ అయిన వారిలో బాబు గోగినేని, తేజస్వీ, భాను శ్రీ, సంజన, కిరీటి ఉన్నారు. మధ్యలో నూతన్‌ నాయుడు, శ్యామల ఎలిమినేట్‌ అయినప్పటికీ రీ ఎంట్రీ ద్వారా మళ్లీ బిగ్‌బాస్‌ ఇంటికి వచ్చారు. వైల్డ్‌ కార్డు ఎంట్రీ ద్వారా పూజ రామచంద్రన్‌ హౌస్‌కు ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌ మొత్తంలో తనకు తాను ‘బిగ్గర్‌ బాస్‌’గా చెప్పుకునే బాబు గోగినేని ఎలిమినేట్‌ కావడం ఒకరకంగా ఆశ్చర్యమే. ఇప్పటికే 60 రోజులు పూర్తి చేసుకున్న ఈ షో రోజు రోజూకూ విభిన్న టాస్క్‌లతో ముందుకు సాగుతూ అలరిస్తోంది.

Related posts

Leave a Comment