బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ .. కీలకమైన పాత్రలో నాగ్

రణబీర్ కపూర్ హీరోగా ‘బ్రహ్మాస్త్ర’
కథానాయికగా అలియా భట్
కీలకమైన పాత్రలో అమితాబ్
తెలుగులోని సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా నాగార్జున సుదీర్ఘ కాలంగా తన హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ప్రయాణంలో అప్పుడప్పుడు ఆయన హిందీ సినిమాల్లోనూ మెరిశారు. త్వరలో ఆయన మరోమారు ఓ హిందీ సినిమాలో కనిపించనున్నారనేది తాజా సమాచారం.

రణబీర్ కపూర్ .. అలియాభట్ జంటగా హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అమితాబ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను నాగార్జున చేస్తే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు ఆయనను సంప్రదించారట. కథ .. తన పాత్ర నచ్చిన కారణంగా, తన అభిమాన నటుడు అమితాబ్ ఆ సినిమాలో చేస్తున్నందు వలన వెంటనే నాగ్ ఓకే చెప్పేశారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగులో పాల్గొనేందుకు ముంబై వెళ్లనున్నట్టుగా సమాచారం.

Related posts

Leave a Comment