ఫ్లాట్ ఫామ్ వెదవ అప్పుల్లో ఉన్నవాడు నాపై సినిమానా? : లక్ష్మి పార్వతి

ఎన్టీఆర్ జీవిత ఆధారంగా తెరకెక్కిస్తోన్న సినిమాలపై లక్ష్మి పార్వతి మరో సారి ఫైర్ అయ్యారు. ముఖ్యంగా లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాను తెరకెక్కించడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పర్మిషన్ లేకుండా సినిమా ఎలా తీస్తారని తెలిపారు. అంతే కాకుండా.. కేతిరెడ్డి ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చి పిచ్చి కూతలు కుయడానికి ఎంత దైర్యమని ఎన్టీఆర్ ని గౌరవానికి భంగం కలిగేలా సినిమా తీస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మాట్లాడారు.

ఇక తాను 1923 జూన్ 20న విడాకులు తీసుకున్నాను అని చెబుతూ.. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ మళ్లీ ఆ వ్యక్తితో ముడిపెట్టి సినిమాను తీయడం చాలా దారుణమని వ్యాఖ్యానించారు. సినిమా పోస్టర్ కూడా చాలా అసహ్యంగా ఉందని, ఇంతటి కుసంస్కరంతో సినిమాను తీస్తారా? ఒక చెల్లి అక్కా ఉన్న వ్యక్తులెవరు ఇంత నీచానికి దిగజారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఒకడు అప్పుల్లో ఉండి సినిమాను తీస్తున్నాడు అని మరొకడు ఫ్లాట్ ఫామ్ వెదవ అని అమీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి వెనుక ఎవరు వున్నారో తనకు తెలుసనీ వారిని త్వరలోనే బయటికి లాగుతానాని లక్ష్మి పార్వతి తెలిపారు.

Related posts

Leave a Comment