ఫేస్ బుక్ కు 4 కోట్లకు పైగా జరిమానా విధించిన బ్రిటన్

యూజర్ల డేటా చోరీ విషయంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫేస్ బుక్
అమెరికాలో కొనసాగుతున్న విచారణ
దర్యాప్తు జరిపి, జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించిన బ్రిటన్
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై బ్రిటన్ కన్నెర్రజేసింది. యూజర్ల డేటాను భద్రంగా ఉంచడంలో విఫలమైనందుకు రూ. 4 కోట్లకు పైగా (5 లక్షల పౌండ్లు) జరిమానా విధించనున్నట్టు ఆ దేశ డేటా నియంత్రణ సంస్థ వెల్లడించింది.

కేంబ్రిడ్జ్ అనలిటికా ద్వారా ఫేస్ బుక్ నుంచి కోట్లాది మంది యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ అయినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికాలో ఇప్పటికే ఫేస్ బుక్ న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంపై స్పందించిన ఫేస్ బుక్ యాజమాన్యం… పొరపాటు జరిగిందని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో, బ్రిటన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కార్యాలయం కూడా ఫేస్ బుక్ కార్యకలాపాలపై దృష్టి సారించింది. యూజర్ల డేటా భద్రతపై దర్యాప్తు జరిపింది. డేటా చోరీకి గురైనట్టు దర్యాప్తులో తేలడంతో… జరిమానా విధించేందుకు సిద్ధమైంది.

Related posts

Leave a Comment