ప్రియుడు మోసం చేయడంతో సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి..

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో ఘటన
ప్రియుడి ఇంటి ముందు మూడు రోజుల ధర్నా
ఫలితం లేకపోవడంతో సెల్‌టవర్‌ వద్దకు యువతి
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో సెల్‌టవర్‌ ఎక్కిన ఓ యువతి అక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తోంది. తనను ఓ అబ్బాయి ప్రేమించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది. వలిగొండ మండల కేంద్రానికి చెందిన రావుల భాస్కర్ అనే యువకుడు ఇన్నాళ్లు తనతో తిరిగి పెళ్లి పేరు ఎత్తేసరికి తనను కలవద్దంటున్నాడని తెలిపింది. ఆ యువకుడి ఇంటి ముందు మూడు రోజులుగా ధర్నా చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదని వాపోయింది. వెంకటేశ్వర థియేటర్ పక్కన ఉన్న ఆ సెల్ టవర్‌పై ఉన్న ఆమెను దిగి రావాలని స్థానికులు కోరుతున్నారు.

Related posts

Leave a Comment