‘ప్రియమైన కర్ణాటక ప్రజలారా..!’ సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర ట్వీట్

బీజేపీతో మనం లెక్కలు నేర్చుకుందాం
తెలివిగా ఎన్నుకోండి .. యడ్డీ వద్దు
అనివీతిపరుల చేతుల్లో రాష్ట్రాన్ని పెడదామా?
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మళ్లీ విజయం కట్టాబెట్టాలని కోరుతూ సీఎం సిద్ధరామయ్య ఆసక్తి కర ట్వీట్ చేశారు. అవినీతి ఆరోపణల కేసులలో జైలుకెళ్లొచ్చిన బీజేపీ నేత యడ్యూరప్పకు, ఆ గ్యాంగ్ ను ఈ ఎన్నికల్లో గెలిపించవద్దని కోరుతూ ఈ ట్వీట్ చేశారు. అయితే, ఈ విషయాన్ని తనదైన శైలిలో సిద్ధరామయ్య చెప్పారు.

‘ప్రియమైన కర్ణాటక ప్రజలారా,

బీజేపీతో మనం లెక్కలు నేర్చుకుందాం :

జైలు పక్షి యడ్డీ =1
అపఖ్యాతి రెడ్డి బ్రదర్స్ = 2 1
శ్రీరాములు = 3 1
కట్టా సుబ్రమణ్యం = 4 1
కృష్ణయ్య శెట్టి = 5 1
హర్తల్ హలప్పా = 6 1
రేణుకాచార్య = 7 1 … రాష్ట్రాన్ని ఈ గ్యాంగ్ చేతుల్లో పెడదామా? తెలివిగా ఎన్నుకోండి ! యడ్డీ వద్దు’ అని సిద్ధరామయ్య కోరారు.

Related posts

Leave a Comment