ప్రధాన పాత్రలో అనుష్క .. అతిథి పాత్రలో నాని!

లేడీ ఓరియెంటెడ్ మూవీతో చంద్రశేఖర్ యేలేటి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం
అనుష్క చుట్టూ తిరిగే కథ
విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటి కనిపిస్తాడు. ‘ఐతే’ .. ‘అనుకోకుండా ఒకరోజు’ .. ‘మనమంతా’ సినిమాలు ఆయన అభిరుచికి అద్దం పడుతుంటాయి. ఆయన దర్శక ప్రతిభకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటాయి. త్వరలోనే ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక కథను ఆయన సిద్ధం చేసుకున్నారట. ఈ పాత్ర కోసం ఆయన ఆల్రెడీ అనుష్కను సంప్రదించి ఆమెను ఒప్పించినట్టుగా సమాచారం. ‘భాగమతి’ తరువాత అనుష్క ఓకే చెప్పిన కథ ఇది. ఈ సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రను నాని చేస్తే బాగుంటుందని భావించిన చంద్రశేఖర్ యేలేటి ఇటీవలే ఆయనను కలిశారని సమాచారం. పాత్రలోని కొత్తదనం నచ్చడం వలన నాని అంగీకరించాడని అంటున్నారు. మంచి క్రేజ్ వున్న మరో ఇద్దరు ఆర్టిస్టులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.

Related posts

Leave a Comment