ప్రత్యర్థి కంపెనీలకు ఎయిర్ టెల్ మరో సవాల్… రూ.558తో రోజూ 3జీబీ డేటా

  • ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయాలు
  • వొడాఫోన్, జియోకు పోటీ
  • వొడాఫోన్ సైతం ఇవే బెనిఫిట్స్ తో రూ.569 ప్లాన్

టెలికం కంపెనీల మధ్య డేటా వార్ కొనసాగుతోంది. ఎయిర్ టెల్ మరో సరికొత్త ప్లాన్ ను ప్రకటించి పోటీ కంపెనీలకు సవాల్ విసిరింది. రూ.558తో రీచార్జ్ చేసుకునే వారికి ప్రతి రోజూ 3జీబీ 4జీ డేటాను 82 రోజుల పాటు అందించనుంది. 82 రోజుల్లో మొత్తం 246 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అలాగే, అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. వాయిస్ కాల్స్ పై ఎటువంటి పరిమితి లేదు. వొడాఫోన్ ఇటీవలే రూ.511, రూ.569తో ప్లాన్లను తీసుకువచ్చింది. ఇందులో రూ.569 ప్లాన్ లో రోజూ 3జీబీ డేటాను, రూ.511 ప్లాన్ లో రోజూ 2జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. వీటి వ్యాలిడిటీ 84 రోజులు.

Related posts

Leave a Comment