పేపర్‌లో చూస్తూ 15 నిమిషాలైన మాట్లాడండి చూద్దాం: మోదీకి సిద్ధరామయ్య ప్రతి సవాల్‌

నిన్న రాహుల్‌ గాంధీకి మోదీ సవాల్‌
కాగితం చూడకుండా 15 నిమిషాలైనా మాట్లాడాలన్న మోదీ
ట్విట్టర్‌లో ప్రతి సవాల్‌ విసిరిన సిద్ధరామయ్య
గతంలో యడ్యూరప్ప సర్కారు సాధించినవేంటని ప్రశ్న
ప్రశంసలు, విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు అన్నీ ట్విట్టర్‌ వేదికగానే జరుగుతున్నాయి. నిన్న కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా సంతెమారహళ్లిలో బహిరంగసభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఓ సవాలు విసిరిన విషయం తెలిసిందే. ‘హిందీ లేక ఆంగ్లం లేక మీ అమ్మగారి మాతృభాష ఇటాలియన్‌లో 15 నిమిషాలు కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయాలను కాగితం చూడకుండా మాట్లాడండి’ అని మోదీ సవాల్ విసిరారు.

దీనిపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. ఈ రోజు ట్విట్టర్‌లో మోదీకి ప్రతి సవాలు విసిరారు. కర్ణాటకలో గతంలో యడ్యూరప్ప సర్కారు సాధించినవేంటో 15 నిమిషాలు పేపర్‌లో చూసుకుంటూ అయినా మాట్లాడాలని అన్నారు.

Related posts

Leave a Comment