పుల్వామాలో ఉగ్రదాడి: నలుగురు జవాన్లు మృతి

దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ శిక్షణా కేంద్రంపై ఉ్రగవాదులు దాడికి దిగారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు భధ్రతా బలగాలపై గ్రనేడ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. వారి దాడిని సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

శిక్షణా శిబిరం నుంచి మరో ఆరుగురు జవాన్లు సురక్షితంగా బయటపడ్డారు. మృతుల్లో కానిస్టేబుల్‌ సైఫుద్దీన్‌ సాజ్‌ ఉన్నట్లు సీఆర్‌పీఎఫ్‌ వెల్లడించింది. అవంతి పోరా ప్రాంతంలోని లెత్‌పోరాకు సమీపంలోని 185వ బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌ కేంద్రంపై ఆదివారం తెల్లవారుజామాను 2.10 నిమిషాల ప్రాంతంలో మిలిటెంట్లు దాడికి దిగారు. దాదాపు పదకొండు గంటల పాటు ఇరువైపుల భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఏడాది ఆగస్టులో పుల్వామాలో ఇలాంటి దాడే చోటుచేసుకుంది. ఉగ్రవాదులు జిల్లా పోలీస్‌ కాంప్లెక్స్‌ను లక్ష్యంగా చేసుకొని దాడికి దిగారు. ఈ దాడిలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Related posts

Leave a Comment