పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: బోండా ఉమ ధ్వజం

చింతమనేని ప్రభాకర్‌పై ఆరోపణలు సరికావు
రౌడీ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారనడంపై ఆగ్రహం
ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి
మహిళా అధికారిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడులు చేశారంటూ వ్యాఖ్యానించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అందులో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్‌పై పవన్ చేసిన ఆరోపణలు సరికావన్నారు.

తెలుగుదేశం పార్టీ రౌడీ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తోందన్న జనసేనాని మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని ప్రతిపక్షంలో ఉండగా చేసిన రాజకీయ పోరాటాలపై పెట్టిన కేసులనే పవన్ ప్రస్తావిస్తున్నారని.. రాజకీయ నాయకుడన్నాక అలాంటి కేసులు సహజమని ఉమ పేర్కొన్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలన్నారు.

Related posts

Leave a Comment