పవన్ పాడిన ‘కొడకా కోటేశ్వరరావు..’ పాట విడుదల!

‘అజ్ఞాతవాసి’ చిత్రంలోని ఆరో పాట విడుదల
హుషారుగా ‘కొడకా.. కొడకా.. కొడకా కోటేశ్వరరావు కరుసై పోతవురో..’ పాట
‘యూ ట్యూబ్’ ద్వారా పాట విడుదల చేసిన చిత్రయూనిట్
‘అజ్ఞాతవాసి’ చిత్రంలోని ఐదు పాటల ఆడియో ఇప్పటికే విడుదలైంది. ఈ చిత్రంలో ఆరో పాట ‘కొడకా కోటేశ్వరరావు’ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా పాడారు. ఈ పాటను కొత్త సంవత్సరం కానుకగా డిసెంబరు 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని నిమిషాల క్రితం ఈ పాటకు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘కొడకా.. కొడకా.. కొడకా కోటేశ్వరరావు కరుసై పోతవురో..’అంటూ ఎంతో హుషారుగా పవన్ పాడారు. ఈ వీడియోలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు అనిరుథ్, పాటల రచయిత భాస్కర భట్ల తదితరులు ఉన్నారు. పవన్ ఈ పాట పడే దృశ్యంతో పాటు ఈ పాటను చిత్రీకరించిన సన్నివేశాలను పొందుపరిచారు.

Related posts

Leave a Comment