పవన్ కల్యాణ్ ని మర్చిపోయి.. జనసేన పార్టీయే గుర్తుండాలి: జనసేన అధినేత

జనసైనికుల భావావేశాలను నాయకులు అర్థం చేసుకోవాలి
పార్టీ కార్యకర్తలు ప్రేమతో వచ్చే వాళ్లు, డబ్బుల కోసం కాదు
‘జనసేన’ భావజాలం అందరిలో బలంగా నాటుకుపోవాలి
విశాఖపట్టణం నగరంలో జరిగిన ‘జనసేన’ కార్యకర్తల, నాయకుల సమావేశంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రేమతో వచ్చే వాళ్లని, డబ్బులిస్తే వచ్చే వాళ్లు కాదని అన్నారు. జనసైనికుల భావావేశాలను నాయకులు అర్థం చేసుకోవాలని, వాళ్ల ఉత్సాహం ఇబ్బంది కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికి వాళ్లు చూపే ప్రేమ ఎనలేనిదని కొనియాడారు. ‘మీ కోసం వచ్చాను. మీరు లేకపోతే ‘జనసేన’ లేదు. భావజాలం ముఖ్యం కానీ, వ్యక్తులు కాదు. ఏదో ఒక రోజుకి పవన్ కల్యాణ్ ని మర్చిపోయి.. జనసేన పార్టీయే గుర్తుండాలనేది నా కోరిక. ‘జనసేన’ భావజాలం అందరిలో బలంగా నాటుకుపోవాలి’ అని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

Related posts

Leave a Comment